రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీ గురుకులాలకు ధోబీ పెండింగ్ బిల్లులను విడుదల చేసేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హామీ ఇచ్చినట్టు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో మంత్రిని రజక వృత్తిదారుల సంఘం ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాల్లో పిల్లల దుస్తులు, స్కూల్ యూనిఫామ్‌లు ఉతికి శుభ్రం చేసే రజక వృత్తిదారుల(ధోబీ)లకు ఏడాది కాలం నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ధోబీ బిల్లులను వెంటనే చెల్లించాలని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో చెరుకు వెంకన్న (సుర్యాపేట), పెద్దింటి రాజు (జగిత్యాల ), కోట్ల వీరేశ్(గద్వాల్) కమ్మంపాటి సుమలత (మిర్యాలగూడ), వై,అనిత( నకిరేకల్) వీరేశ్ (హైదరాబాద్) వీరేశ్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.



