బోరిగాం ఘటన పై రెవెన్యూ శాఖపై విమర్శలు
నవతెలంగాణ -ముధోల్: ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో సోమవారం ప్రభుత్వం భూమిలో బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉద్రిక్తకు దారి తీసింది. అయితే ఈ ప్రభుత్వ భూమిపై వివాదం గ్రామంలోని ఇరు గ్రూపుల నుండి గత కొన్ని నెలలుగా వివాదం నెలకొంది. గతంలోని ఈ భూమి వివాదం రెవెన్యూ శాఖ వరకు చేరింది. తాసిల్దార్ ను మొదలుకొని ఆర్డీవో వరకు గ్రామంలోని ఇరు గ్రూపుల వారితో చర్చల వరకు వెళ్లారు . ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయరాదని రెవెన్యూ అధికారులు గతంలోని చెప్పి వదిలివేశారు. ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలో తీసుకోకుండా ఖాళీగానే వదిలివేశారు. దీంతో గ్రామానికి చెందిన మరో గ్రూప్ సభ్యులు ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి పూనుకున్నారు. దీంతో గ్రామంలోని మరో గ్రూపు సభ్యులు అభ్యంతరం తెలిపటంతో రాళ్లతో దాడి చేసుకునేంతవరకు సమస్య వచ్చింది. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్ రంగ ప్రవేశంతో పోలీసులు సమస్య తీవ్రతను అర్థం చేసుకొని చాకచక్యంగా వ్యవహరించి భారీ పోలీస్ బందోబస్తుతో సమస్యను సద్దుమణిగించారు . ప్రభుత్వ భూములను కాపాడే రెవెన్యూ శాఖ వారు తమ ఆధీనంలో తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య తలెత్తిందని పలువురు గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించాలని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పలుసంఘటనలు చోటు చేసుకోవడంపై విమర్శలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన జరగకముందు పోలీసులు ఇరు గ్రూపులకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు . ప్రభుత్వ భూమిని ఆధీనం తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖ వారు.అయితే చర్యలు తీసుకోవడం లో తాత్సారం పై పలువురు మండిపడుతున్నారు.
శాంతిభద్రతలు కాపాడడానికి పోలీసులు శ్రమిస్తున్నప్పటికీ, రెవెన్యూ శాఖ వారు సక్రమంగా స్పందించకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నయని పలువురు ఆరోపింస్తున్నారు. ఈ భూమి లో బుద్ద విగ్రహంకు కేటాయించాలని ఓక్క గ్రూప్ పట్టు పడుతుండగా,మరో గ్రూపు అక్కడ వద్దని అంటున్నారు . దీంతో గ్రామంలో ఎప్పుడు కలిసిమెలిసి ఉంటే ప్రజలు ఈ భూమి విషయంలో పంతాలకు పోవటంతో ఇరుగ్రూపులు విడిపోయి కొట్టుకునేంతవరకు వెళ్లారు. దీంతో గ్రామంలో ప్రస్తుతం పోలిసు పికేటింగ్ తో పాటు, బందోబస్తు ను నిర్వహింస్తున్నారు.ఈ ప్రభుత్వ భూమిపై వివాదం కొన్ని నెలలుగా నేలకోంది.ఈ విషయం పై తహశీల్దార్ శ్రీకాంత్ ను వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గ్రామస్థులకుగతంలో తేలియజేసిన్నట్లు తెలిపారు.తాము ప్రభుత్వం భూమి రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.