Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'హెటిరో డ్రగ్స్‌' యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

‘హెటిరో డ్రగ్స్‌’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

పీసీబీ ఈఈని సస్పెండ్‌ చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
దోమడుగు గ్రామంలో పర్యటన


నవతెలంగాణ-గుమ్మడిదల
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దోమడుగు నల్లచెరువు కాలుష్యాన్ని కారణమైన హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ(ఎం) నాయకులు దోమడుగు గ్రామంలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా నల్లచెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గత రెండు నెలలుగా రైతుల ఆందోళన చేస్తుంటే పీసీబీ అధికారులు కనీసం గ్రామాన్ని సందర్శించడం లేదని విమర్శించారు.

కాలుష్యానికి కారణమైన ఈసీబీ ఈఈని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 4 గొలుసు కట్టు చెరువులు కింద 5400 ఎకరాలు భూములకు నష్టం జరుగుతుందన్నారు. గ్రామంలో దుర్వాసన వస్తున్నా, బోర్లు పాడవుతున్నా అధికారులు స్పందించటం లేదని తెలిపారు. రైతులు, ప్రజలు, వృత్తిదారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, కృష్ణ, గ్రామ రైతులు బాల్రెడ్డి, మంగయ్య, రాజు శేషారెడ్డి, మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -