- Advertisement -
నేడు ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెమీఫైనల్స్
హైదరాబాద్ : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాల్గో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో చోటు కోసం నాలుగు జట్లు నేడు తాడోపేడో తేల్చుకోనున్నాయి. నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్లో ముంబయి మీటియర్స్, గోవా గార్డియన్స్ తలపడనుండగా.. రెండో సెమీస్‌లో బెంగళూరు టార్పెడోస్, అహ్మదాబాద్ డిఫెండర్స్ పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో నిలకడగా రాణించిన ముంబయి మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ ఫేవరేట్లుగా కనిపిస్తున్నా.. నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన అహ్మదాబాద్, గోవా జట్లను తక్కువ అంచనా వేయడానికి లేదు.
- Advertisement -



