- Advertisement -
న్యూఢిల్లీ : పుష్కరకాలం విరామం తర్వాత జరుగుతున్న ఆసియా యూత్ గేమ్స్‌లో భారత కబడ్డీ జట్లు చాంపియన్‌గా నిలిచాయి. గురువారం బహ్రెయిన్‌లో జరిగిన 3వ ఆసియా యూత్ గేమ్స్ కబడ్డీ ఫైనల్స్‌లో ఇరాన్‌పై 35-32తో 3 పాయింట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించగా.. మహిళల జట్టు 75-21తో 54 పాయింట్ల భారీ తేడాతో ఇరాన్‌ను మట్టికరిపించింది. మహిళల, పురుషుల జట్లు పసిడి పతకాలు సాధించగా.. ఈ జట్లకు తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి కోచ్‌గా వ్యవహరించారు.
- Advertisement -



