లేదంటే రాజీనామా చేస్తారా..?
బీసీల రాజ్యాధికారానికి రాజ్ భవన్ అడ్డు : బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మెన్ డా. రాచాల యుగంధర్ గౌడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలనీ, లేదంటే గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాలనీ బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మెన్ డా. రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో గురువారం బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ”చలో రాజ్ భవన్” నిర్వహించారు. ఈ క్రమంలో రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన బీసీ నేతలను పోలీసులు అడ్డుకో వడంతో వారు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్ తన వద్దనే ఉంచుకొని సంతకం చేయకుండా ఆలస్యం చేస్తున్నారన్నారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తూ బీసీల హక్కులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బీజేపీ ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని గవర్నర్ నిలువరించడం బీసీలను రాజకీయంగా వెనక్కి నెట్టే కుట్రలో భాగమేనని అన్నారు. గవర్నర్ వెంటనే ఆర్డినెన్స్‌పై సంతకం చేయాలని, కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తదనంతరం నాయకులు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం చైర్మెన్ చిరంజీవులు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలరాజు గౌడ్, ఓయూ ఇన్‌చార్జి గణేష్ గౌడ్, నాయకులు అయిలి వెంకన్న, దుర్గయ్య గౌడ్, సింగం నాగేష్, బైరు శేఖర్, వీవీ గౌడ్, గోటూరి రవీందర్, గూడూషా, అంజన్న యాదవ్, దేవర శివ, ధర్మేంద్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ బిల్లును ఆమోదించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



