Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రంలో అవినీతి విలయతాండవం

రాష్ట్రంలో అవినీతి విలయతాండవం

- Advertisement -

తుపాకీ సెటిల్‌మెంట్‌ సెంటర్లు ఫుల్‌
ధాన్యం కొనుగోలు సెంటర్లు నిల్‌ : సర్కారుపై కేటీఆర్‌ ఆగ్రహం

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామరావు విమర్శించారు. గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వేల కోట్లు సంపాదిస్తే, వందల కోట్లు సంపాదించుకోవడంలో మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్‌మెంట్‌ సెంటర్లు ఫుల్‌ అయ్యాయనీ, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పారిశ్రామిక వేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్‌ అధికారులు ఉద్యోగం చేసుకోలేక చేతులెత్తేసే పరిస్థివి వచ్చిందని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, మాఫియా రాజ్యమని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన అవినీతి కంపు రాష్ట్ర వ్యాప్తంగా కొడుతుంది. తెలంగాణను మేము అగ్రికల్చర్‌లో అగ్రస్థానంలో నిలిపాం. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం రాష్ట్రంలో గన్‌ కల్చర్‌ తీసుకువచ్చిందన్నారు. కాంగ్రెస్‌ అవినీతికి ప్రభుత్వ అధికారులు కూడా భయపడుతున్నారని చెప్పారు. వీరి వాటాల పంచాయతీలో మాకు భాగస్వామ్యం వద్దు, మాకు సంబంధం లేదంటూ అధికారులు పారిపోతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను తప్పుడు పనులు చేయమని వేధించడం వల్లనే వారు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. గన్నులు పెట్టి బెదిరించడంతో ఇందిరమ్మ రాజ్యంలో వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల కన్నా దారుణంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల సందర్భం గా మొత్తం బయటపెట్టుకొని తిరిగి రాష్ట్రానికి ఏం సందేశం ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కుక్కలు చింపిన మిస్తరులా చేస్తారన్నారు. మంత్రులు కాంట్రాక్టులు, కమిషన్ల వ్యవహారాన్ని ఇంటి పంచాయితీగా మార్చారని వివరించారు. పొంగులేటి నా టెండర్లలో తలదూర్చారని మంత్రి కూతురు స్వయంగా చెప్పిందనీ, బెదిరింపులు, టెండర్ల రిగ్గింగు ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడు జరగలేదన్నారు. ఇంత దారుణంగా బహిరంగంగా అవినీతి అంశంపైకి వచ్చినా, బెదిరింపులు బయటపడినా బీజేపీ నేతలు స్పందించడం లేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -