Friday, October 24, 2025
E-PAPER
Homeసినిమాతొలిసారి శ్రీ విష్ణు సరసన..

తొలిసారి శ్రీ విష్ణు సరసన..

- Advertisement -

శ్రీ విష్ణు హీరోగా కొత్త దర్శకుడు యదునాథ్‌ మారుతీ రావు దర్శ కత్వంలో ఓ క్రేజీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం:3గా సుమంత్‌ నాయుడు జి నిర్మిస్తుండగా, హేమ, షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఇందులో హీరో శ్రీ విష్ణు సరసన నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించనున్నారని మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఆమెకు బర్త్‌ డే విషెష్‌ అందిస్తూ ఒక స్పెషల్‌ వీడియోని రివీల్‌ చేశారు. ఈ వీడియో చాలా ఎంటర్‌టైనింగ్‌గా అందర్నీ అలరిస్తోంది. ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగే ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సాయి శ్రీరామ్‌, సంగీతం: రధన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.రామాంజనేయులు, లిరిక్స్‌: రామజోగయ్య శాస్త్రి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -