వీటి విలువ రూ. 79 వేల కోట్లు
న్యూఢిల్లీ : రూ. 79 వేల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక హార్డ్‌వేర్ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా క్షిపణులు, యుద్ధ నౌకలతో పాటు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, అధునిక నిఘా వ్యవస్థలు మొదలైనవి కొనుగోలు చేయనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఇది భారీ నిర్ణయం. ఆగస్టు 5న రూ. 67 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
గురువారం ఆమోదించిన కొనుగోలులో నౌకాదళం కోసం ల్యాండింగ్ ఫ్లాట్‌ఫామ్ డాక్స్ (ఎల్‌పీడీలు), 30 మీమీ నావల్ సర్ఫేస్ గన్స్ (ఎన్‌ఎస్‌జిలు), అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్ఫెడోలు (ఎఎల్‌డబ్ల్యూటీలు) వంటి ఆయుధాలు వున్నాయి. వీటిలో ఎల్‌పిడిలను నౌకదళం, వైమానిక దళం కూడా కార్యక్రమలను నిర్వహించడానికి ఉపయోగపడతాయని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సైన్యం కోసం నాగ్ క్షిపణి వ్యవస్థ (ట్రాక్డ్) ఎంకె-2 (ఎన్‌ఎఎంఐఎస్), గ్రౌండ్-బేస్డ్ మొబైల్ ఇఎల్‌ఐఎన్‌టి (ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టం), హై-మొబిలిటి వెహికల్స్ (హెచ్‌ఎంవిలు) కొనుగోలుకు ఆమోదం తెలిపారు. అలాగే, వైమానిక దళం కోసం సహకార లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్/డిస్ట్రక్షన్ సిస్టమ్ (సిఎల్‌ఆర్‌టిఎస్/డిఎస్) కొనుగోలుకు కూడా డిఎసి ఆమోదం తెలిపింది.
ఆయుధాలు, సైనిక హార్డ్‌వేర్ కొనుగోలుకు కేంద్రం ఆమోదం
- Advertisement -
- Advertisement -



