- Advertisement -
ఒకే రోజు రూ .1.02 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో డిజిటల్ చెల్లింపులు సరికొత్త రికార్డ్‌ను నమోదు చేశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సగటు రోజువారీ లావాదేవీలు ఏకంగా 94,000 కోట్లకు చేరాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) వెల్లడించింది. సెప్టెంబర్‌తో పోల్చితే 13 శాతం పెరిగాయని తెలిపింది. ఈ నెల 18న ఏకంగా రూ.1.02 లక్షల కోట్ల విలువైన.. 75.4 కోట్ల యూపీఐ చెల్లింపులు జరిగాయి. ఇది ఒక రోజులో జరిగిన అత్యధిక లావాదేవీలు కావడం విశేషమని ఎన్‌పిసిఐ పేర్కొంది. జిఎస్‌టి సవరణ, ధంతేరాస్, దీపావళి వంటివి చెల్లింపులు పెరగడానికి మద్దతునిచ్చాయని తెలిపింది.
- Advertisement -



