Thursday, November 13, 2025
E-PAPER
Homeబీజినెస్రోజుకు 7 కిలోల బంగారం కొనుగోలు

రోజుకు 7 కిలోల బంగారం కొనుగోలు

- Advertisement -

ఆర్‌బిఐ నిల్వలు 880 టన్నులకు చేరిక

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమంటున్నప్పటికీ.. సెంట్రల్‌ బ్యాంక్‌లు మాత్రం కొనుగోళ్లను ఆపడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) 200 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. రోజుకు సగటున 7 కిలోల బంగారాన్ని సొంతం చేసుకున్నట్లయ్యింది. ఈ ఏడాది బంగారం ధర 60 శాతం పైగా పెరిగినప్పటికీ.. ఇంత భారీ కొనుగోళుచేయడం గమనార్హం. దీంతో ఆర్‌బిఐ మొత్తం బంగారు నిల్వలు 880 టన్నుల స్థాయిని దాటింది. వీటి మొత్తం విలువ 95 బిలియన్‌ (దాదాపు రూ.8.34 లక్షల కోట్లు) డాలర్లుగా ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఏకంగా 600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది.

ఆర్థిక సంవత్సరం 2024-25 చివరి నాటికి 879.58 టన్నులుగా ఉన్న మొత్తం బంగారం నిల్వలు.. సెప్టెంబర్‌ చివరి నాటికి 880.18 టన్నులకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న కార ణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారానికి ఇటీవల చాలా డిమాండ్‌ పెరిగింది. ఈ కారణంగానే అంతర్జా తీయంగా బంగారం ధరలు పెరిగాయి. ఈ కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులు ఆర్థిక ఆస్తిగా బంగారాన్ని నిరంతరం కొనుగోలు చేయడం వలన దేశీయ ధరలు కూడా పెరిగాయి. ఈ డిమాండ్‌ కారణంగానే సెప్టెంబర్‌ నెలలో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

స్వల్పంగా తగ్గిన పసిడి ధర
బంగారం ధరల్లో వరుసగా రెండో రోజూ తగ్గుదల చోటు చేసుకుంది. గుడ్‌ రిటర్న్స్‌ ప్రకారం.. గురువారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గి రూ.1,26,030గా పలికింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.94,570గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.1,59,000గా చోటు చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -