Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ ఫిర్యాదుల వేదికలో సమస్యలపై వినతి 

విద్యుత్ ఫిర్యాదుల వేదికలో సమస్యలపై వినతి 

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో   లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  మండల బిజెపి నాయకులు తాటివార్  రమేష్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార సమస్య వేదిక తెలంగాణ ఉత్తర విద్యుత్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. బైంసా మండలంలోని దెగాం సబ్ స్టేషన్ లో నిర్వహించిన విద్యుత్ పిర్యాదు విభాగం లో ముధోల్ లో నెలకొన్న విద్యుత్ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముధోల్ లోని కోలి గల్లి,ధనగర్ గల్లి కూడల్లో కొన్ని యేళ్ళుగా అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ లైన్ వల్ల  విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా పండుగ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం తో ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు.

ముధోల్  గ్రామంలో ఏచిన్న విద్యుత్ సమస్య ఉన్నా మిగతా  ఏరియాలో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.గత కొన్నేళ్లుగా ఉన్న  ఇనుప స్తంభాలను తొలగించాలని అన్నారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ లైన్ లో ఇండ్ల పైనుండి ఉన్నాయని ఎంతో ప్రమాద భరితంగా దర్శనమిస్తున్నాయని వారు పేర్కొన్నారు. పలు కాలనీలో అవసరం ఉన్న చోట కొత్త స్థంబాలు ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఉప సర్పంచ్ మోహన్ యాదవ్, నాయకులు రూమోల్ల జీవన్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -