నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు ధర్నా నిర్వహించి కార్మిక శాఖ అధికారి కమర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ.. జిజిహెచ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానీట్ టీ తే స్టేషన్ శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జిజిహెచ్ ను వెయ్యి పడగలకు పెంచి కార్మికులపని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రతినెల వేతనాలు చెల్లించడంతోపాటు రిటర్మెంట్ అయిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలనికేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి హైమది బేగం,కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు స్వరూప, భారతి, పవిత్ర, వెంకట్, రాధా కుమార్ మరియు కార్మికులు పాల్గొన్నారు.
డీసీఎల్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


