నవతెలంగాణ-హైదరాబాద్: ఎండల తీవ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులతో పాటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మే 14న అండమాన్ కు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది అల్పపీడనం గా మారితే మే నెలాఖరు వరకూ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న మూడ్రోజుల్లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
రైతన్నలకు చల్లని కబురు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES