Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయం11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్‌

11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి పాక్ పై భారత్‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో చావుదెబ్బ తీసింది. ఈ దాడుల‌తో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. తాజాగా పాక్ వివ‌రాల‌ను వెల్లడించింది. భారత్‌ జరిపిన దాడిలో 11 మంది సైనికులు మరణించినట్లు దాయాది దేశం పేర్కొంది. మృతుల్లో ఆరుగురు పాక్‌ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపింది. ఇక ఈ దాడిలో మరో 78 మంది గాయపడినట్లు వెల్లడించింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్‌పీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -