- Advertisement -
ముంబయి : భారత ప్రకటనల రంగంలో ప్రసిద్ధ ప్రకటనలతో తనదైన ముద్ర వేసిన ప్రముఖ వాణిజ్య ప్రకటనల రూపకర్త పీయూశ్ పాండే (70) మతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పాండే నెల రోజులుగా కోమాలో ఉన్నట్టు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆయన మరణించనట్లు ప్రముఖ ప్రకటనల సంస్థ ఓగిల్వీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పాండే ఓగిల్వీ ఇండియాకు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఫెవికాల్, క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్, ఓగిల్వీ ఇండియా వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లకు ప్రచార ప్రకటనలను రూపొందించారు.
- Advertisement -



