Saturday, October 25, 2025
E-PAPER
Homeబీజినెస్ఆర్‌ఎన్‌ఐటి ఎఐ సొల్యూషన్స్‌ లిస్టింగ్‌

ఆర్‌ఎన్‌ఐటి ఎఐ సొల్యూషన్స్‌ లిస్టింగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ఆర్‌ఎన్‌ఐటి ఎఐ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ భారత స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ పొందిన తొలి ఎఐ ఆధారిత గవర్నెన్స్‌ సంస్థగా నిలువనుందని ఆ సంస్థ పేర్కొంది. శుక్రవారం బిఎస్‌ఇ వద్ద ఆర్‌ఎన్‌ఐటి ఎఐ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఎండి, సిఇఒ రాజా శ్రీనివాస్‌ నందిగం స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభ ఘంటాను మోగించి అధికారికంగా ట్రేడింగ్‌ ప్రారంభాన్ని ప్రకటించారు. దీంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) ఆధారిత గవర్నెన్స్‌, డిసిషన్‌ ఇంటెలిజెన్స్‌లో కొత్త యుగానికి శ్రీకారం చుట్టినట్లయ్యిందని రాజా శ్రీనివాస్‌ తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న తమ సంస్థకు ఇది ఒక ఆర్థిక ఘట్టం మాత్రమే కాదని.. తమ మిషన్‌కు సంబంధించిన మైలురాయి కూడా అని అన్నారు. దీంతో ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌, ఫుడ్‌ రంగాల్లో విస్తరించడానికి మరింత శక్తిని పొందుతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -