Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్కాంపిటీటివ్ పరీక్షలలో రాణించిన శ్రీవైష్ణవి విద్యార్థులు

కాంపిటీటివ్ పరీక్షలలో రాణించిన శ్రీవైష్ణవి విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యా విధానం ఐపిఈ ఫలితాలే కాకుండా జేఈఈ/ఎన్ ఈఈటి/ ఈఏపిసిఈటి  పరీక్షా ఫలితాలలో శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మధిర మల్లేశం  మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్మీడియట్ తరగతులతో పాటు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రత్యేకమైన ప్రణాళికతో, విద్యా సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్యాబోధన నిర్వహిస్తున్నామన్నారు. బాలికలతో పాటు బాలురకు  జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఏకైక కళాశాల శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల  అని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం మరింత పటిష్టమైన ప్రణాళికతో రాష్ట్రంలోని  కార్పొరేట్ కళాశాలల దీటుగా ముందుకు సాగుతామన్నారు. మెరుగైన ర్యాంకుల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఏకైక కళాశాల శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల  అని పేర్కొన్నారు.  విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదములు. విద్యార్థులకు అభినందనలు  తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -