- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇతర పదవుల్లో ఉన్నవారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పదవులు ఇవ్వడం కుదరదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. డీసీసీల ఎంపికలో సామాజిక న్యాయం ఉంటుందని ఆయన తెలిపారు. సమర్థవంతమైన వారిని డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామన్నారు. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉందని. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో అధిష్టానం సీఎం రేవంత్, Dy.CM భట్టి విక్రమార్కతో పాటు తన అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుందని తెలిపారు.
- Advertisement -



