Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించిన సీపీ సాయి చైతన్య

సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించిన సీపీ సాయి చైతన్య

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో” సైకిల్ /బైక్ ర్యాలీ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సైకిల్ / బైక్ ర్యాలీ ఉదయం 9:30 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు.పూలాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా- కోర్టు చౌరస్తా – గ్లామర్ హోటల్ చౌరస్తా – చెన్నైయ్ షాపింగ్ మాల్ చౌరస్తా- ఆర్.టి.సి బస్టాండ్ – ప్రభుత్వ హాస్పటల్- దేవిరోడ్డు చౌరస్తా -గాంధీ చౌక్ చౌరస్తా – నెహ్రూ పార్కు చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఎందరో పోలీస్ సిబ్బంది ప్రగతి అంతర్గత భద్రత కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోంటూ నేరాల అరికట్టడం, మాదక ద్రవ్యాల అణచివేయడానికి, మహిళ భద్రతకు ,తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.

వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేటు లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నేల చెరగని ముద్ర వేసిందని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్న, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరమర్శించినట్లు తెలిపారు.

మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫాం అందరికీ గర్వకారణమని వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం న్యాయం కోసం ,ఎప్పటికీ తలవంచకుండా. పక్షపాతం లేకుండా, సేవా చేయడానికి మన హృదయలతో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. అదే విధంగా ఈ నెల 29 న రక్తదాన శిబిరం ఏర్పాటుచేస్తామని, ఇందులో ప్రతీ ఒక్కరు పాల్గొన్నాలని తెలియజేశారు. ఈ కార్యాక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డి.సి.పి ( ఎ.ఆర్ ) రామ్ చందర్ రావ్, నిజామాబాద్, ట్రాఫిక్ ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి,  మస్తాన్ అలీ, సి.ఐలు, రిజర్వు ఇన్స్ పెక్టర్లు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది . ఎన్.సి.పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -