Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 4న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

నవంబర్ 4న ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో నేడు ఆ సంస్థ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుని తమ సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు అట్టి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నవంబర్ 4వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ తెలిపారు. ఆనాడు సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఉపాధ్యక్షులు సుజాత సుర్యరాజ్, ఈ.సి మెంబెర్స్ సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -