- Advertisement -
విభేదాలకు స్వస్తి పలికిన అన్నా తమ్ముళ్లు ..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామంలో వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నా, తమ్ముళ్లు ఇద్దరు మండలంలోనే బలమైన లీడర్లు. కానీ వారి ఇద్దరి మధ్యలో సఖ్యత లేక ఆ గ్రామంలో ఏ ఎన్నికలలో పోటీ చేయాలన్నా.. పండగలు జరిగినా.. ఎలాంటి శుభకార్యాలు జరిగినా.. ఎవరి వర్గం వారిదే అనే విధంగా ఉండేది. కానీ, శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో విభేదాలకు స్వస్తి పలికి అన్నా తమ్ముళ్లు ఇద్దరు ఒక్కటవడంతో మండలంలో చర్చనీయాంశం అయ్యింది .ఇరు వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు, నాయకులు, సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -



