Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈఓ..

పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈఓ..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని వసుధ, లిటిల్ ఫ్లవర్ పాఠశాలలను  మండల విద్యాధికారి అశోక్ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మేటివ్ పరీక్షలను విద్యాధికారి అశోక్ పరిశీలించి మాట్లాడుతూ.. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాలల్లో సమ్మేటివ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించడం జరిగిందని అన్నారు. విద్యార్థులందరూ పరీక్షలు రాసేలా చూడాలని యాజమాన్యాలను సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్ లు శ్రీనివాస్, శంకర్ మరియు ఉపాధ్యాయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -