Sunday, October 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జ్ఞానేశ్వర చారికి గోపాలకృష్ణ బ్యాచ్ విద్యార్థుల సన్మానం

జ్ఞానేశ్వర చారికి గోపాలకృష్ణ బ్యాచ్ విద్యార్థుల సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణానికి చెందిన ఉదారి జ్ఞానేశ్వర చారి విజయవాడలోని కే.ఎల్‌ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌.డి‌ పట్టాను ఇటీవల సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంధుమిత్రులు తోటి స్నేహితులు, కుటుంబీకులు ఆయనను సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే శనివారం శ్రీ గోపాలకృష్ణ విద్యా మందిర్ 1998- 99 బ్యాచ్ మిత్ర బృందం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల చారి నివాసానికి వెళ్లి దంపతులను ఇద్దరిని శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. భార్య ఉదారి స్వాతి సైతం 2023సంవత్సరంలో క్వాంటమ్ కంప్యూటింగ్ లో పీహెచ్.డీ పట్టా సాధించారు.

గత 13 సంవత్సరాల నుండి దంపతులిద్దరు బీవిఆర్ ఐటీలో లెక్చరర్ గా చేస్తూ పీహెచ్.డీ పట్టా సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టా సాధించడానికి ఎన్నో కఠిన పరీక్షలను అధిగమించరాని కొనియాడారు. విద్యా ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మైలురాయి అని అంకితభావం, మేధస్సు నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. తమ బ్యాచ్ లో పీహెచ్.డీ పట్టా చారి సాధించడం తమ పాఠశాలకు, బ్యాచ్ కే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రంజిష్, జగదీష్, ఎస్.శ్రీనివాస్, జైపాల్, సంతోష్ గౌడ్, జీ. శ్రీనివాస్, లింగన్న, సచిన్ దేశ్ పాండే, ప్రమోద్, దిలీప్, వెంకన్న ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -