నవతెలంగాణ – ఆర్మూర్
విశ్వబ్రాహ్మణుల కుల వృత్తులు అంతరించిపోయి నేడు అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి శనివారం తెలిపారు. మెదక్ జిల్లా పెద్ద బజార్ రంగరాజు గల్లి కి చెందిన స్వర్ణకారుడు లష్కరి నరేష్ చారి (38) బంగారం పని లేక ఆర్థిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఇతనికి తల్లి.బాలమణి భార్య పుష్ప( 32).. కూతుర్లు బిందు శ్రీ(14). శిరీష(12) ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా దీనస్థితిలో ఉంది.. వారు కూడా ఆత్మహత్య చేసుకుందామని పరిస్థితుల్లో ఉన్నారు.. దయచేసి దాతలు సహకరించి వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటూ తోటి స్వర్ణకార కుటుంబాన్ని నిలబెడదాం అని, పెద్ద మనసుతో దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండి ఆదుకోవాలని లష్కరినరేష్ చారి 9000659059, పుష్ప అక్క కొడుకు కమ్మరి శ్రీకాంత్ 9346745967 నంబర్లకు సహాయం అందించి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరినారు.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



