నవతెలంగాణ – దుబ్బాక: ఎదురెదురుగా బైక్, బొలెరో వాహనం ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన దుబ్బాక మండల పరిధిలోని రాజక్కపేట శివారులో శనివారం మధ్యాహ్నం జరిగింది. 108 సిబ్బంది ఎల్లప్ప, పర్శరాములు తెలిపిన వివరాల ప్రకారం.. రాజక్కపేటకు చెందిన బిట్ల గణేష్, ఆస బాల పవన్, కరికె కిషోర్ అనే ముగ్గురు యువకులు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బైక్ పై రాజక్కపేట నుంచి దుబ్బాకకు వస్తున్నారు. అదే సమయంలో దుబ్బాక నుంచి ముస్తాబాద్ కు వెళ్తున్న బొలెరో వాహనం రాజక్కపేట శివారులోని మల్లన్న గుట్టలకు వెళ్లే దారి మూలమలుపులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు కాగా.. ఒకరికి మోకాలి చిప్ప విరిగింది. మెరుగైన చికిత్స కోసం వీరిని సిద్దిపేటలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బైక్ బొలెరో ఢీ.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



