Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ..

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ..

- Advertisement -

సన్నాలు కన్నా దొడ్డు రకం వడ్లు ఎక్కువగా ఎందుకు వేశారన్న కలెక్టర్ 
కొనుగోల్ల రికార్డుల తనిఖీ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ లో కమ్మర్ పల్లి సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రం ద్వారా ఇంతవరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, రైస్ మిల్లులకు తరలించిన వివరాలు,  మద్దతు ధర చెల్లించిన వివరాలు మొదలగు అంశాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోల కేంద్రానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. లారీలు సమయానికి వస్తున్నాయా? రైస్ మిల్లర్లు సహకరిస్తున్నారా? అని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం లారీల సమస్య లేదని, మిల్లర్లు కూడా సహకరిస్తున్నారని స్థానిక అధికారులు బదులిచ్చారు. కొనుగోలు కేంద్రంలో  సన్నాలు కన్నా దొడ్డు రకం వడ్లు ఎక్కువగా వస్తున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్ సన్నాలు ఎందుకు  ఎక్కువగా పండించలేదని రైతులను ప్రశ్నించారు. దొడ్డు రకం వడ్లపై రైతుల ఆసక్తి చూపారని, దిగుబడి అధికంగా వస్తుందన్న ఉద్దేశంతో దొడ్డు రకం వడ్లు వేశారని అధికారులతో పాటు స్థానిక రైతులు పేర్కొన్నారు. దాంతోపాటు కొన్ని కంపెనీలు తమ విత్తనోత్పత్తికి సంబంధించి రైతులతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి ఈ సందర్భంగా అధికారులు తీసుకువచ్చారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ, డిఎస్ఓ , కమ్మర్ పల్లి సొసైటీ చైర్మన్ రేగుంట దేవేందర్, తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, డిఆర్డిఏ జిల్లా ఏపీడి రవీందర్,  ఐకెపి మార్కెటింగ్ డిపిఎం సాయిలు, ఏపిఎం కుంట గంగాధర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -