Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం

జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలనుసారం జిల్లా సమీకృత సముదాయ కార్యాలయంలో సీనియర్ సివిల్ జడ్జ్ వి. రజని లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ప్రారంభించారు. నాల్సా (లీగల్ సర్వీసెస్ టు సీనియర్ సిటిజన్స్) స్కీమ్ 2016 లో ప్రకారం ప్రతి ట్రిబునల్స్ లో లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ ఏర్పాటు చేసి సీనియర్ సిటిజన్స్ కి ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించాలని తెలిపారు. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం తల్లిదండ్రులను నిరాశ్రయులను చేసిన పిల్లల నుండి సంరక్షణ పొందడానికి లీగల్ సర్వీసెస్ క్లినిక్ లో ఉన్న పారా లీగల్ వాలంటీర్ కొమ్ము వెంకటేష్ సహాయంతో సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ జి పి అనంత రాజ్, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, శ్రీదేవి పారాలిగాలి వాలంటీర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -