పాషా, నరహరికి అశ్రునివాళి
36వ వర్ధంతికి తరలి వచ్చిన సీపీఐ(ఎం) శ్రేణులు
ఇబ్రహీంపట్నంలో భారీ ప్రదర్శన
కదం తొక్కిన రెడ్ షర్టు వాలంటీర్లు
స్తంభించిన నాగార్జున సాగర్ జాతీయ రహదారి
అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి సీపీఐ(ఎం) రథ సారధులు కామ్రేడ్ పాషా, నరహరి 36వ వర్ధంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ విజయవంతంగా సాగుతుంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. పాషా, నరహరికి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రెడ్ షర్టు ధరించిన శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ జాతీయ రహదారి స్తంభించింది.
పాషా నరహరి నివాళి అర్పిస్తూ ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. వారి జీవిత చరిత్ర, పోరాటాల ఇతివృత్తాలు వర్ణిస్తుంటే సభికులు కంట నీరు పెట్టారు. 36వ వర్ధంతి సభకు జిల్లా కార్యదర్శి పి యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, సామెల్, రామ్ చందర్, జగదీష్, కందుకూరి జగన్, చంద్ర మోహన్, ఏర్పాల నర్సింహా, ఆయా మండల పార్టీ కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




