Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇండ్ల స్థలాలు లేని దళితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి 

ఇండ్ల స్థలాలు లేని దళితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి 

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జి. రాజు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

ఐజ మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలో ఇండ్ల స్థలాలు లేని దళితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు కోరారు. ఆదివారం ఐజ మండలం యాపదిన్నె గ్రామంలో మండల అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజు పాల్గొని మాట్లాడారు యాపదిన్నె గ్రామంలో ఇండ్ల స్థలాలు ఇండ్లు లేక దళితులు ఒకే ఇంటిలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు.

పూరి గుడిసెలలో మట్టిమిద్దెలలో నివసిస్తున్న దళితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు గ్రామంలో సిసి రోడ్లు లేక వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. కరెంటు స్తంభాలు వీధిలైట్లు లేక అంధకారంలో దళితులు మగ్గుతున్నారని అన్నారు మిషన్ భగీరథ నీళ్లు సరిపడా రావడంలేదని అన్నారు. అనంతరం యాపదిన్నె గ్రామ కమిటీని జిల్లా కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులు చిన్న నరసింహులు ప్రధాన కార్యదర్శి ధనంజయ గ్రామ కమిటీ సభ్యులు భాస్కర్ ఎర్రన్న శాంతిరాజు సోమన్న ఆనంద్ పెద్ద బుచ్చన్న అశోక్ చిట్టిబాబు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -