అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని పార్టీ నాయకులు , కార్యకర్తలతో కలిసి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ “ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఐదు సంవత్సరాల తర్వాత భారత్–చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం వాణిజ్యం, పర్యాటకం మరియు ప్రజల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుంది. ఇది ప్రపంచానికి భారత ఆర్థిక శక్తి, దౌత్య సమతుల్యతను చూపించే ఒక చిహ్నం అని పేర్కొన్నారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. పటేల్ నిర్మించిన ఐక్యత పునాదులు నేటి అభివృద్ధి భారతానికి బలమైన స్థంభాలుగా నిలిచాయి. ‘రన్ ఫర్ యూనిటీ’ ద్వారా ఐక్యత, సమైక్యత, జాతీయతా భావం మరింత బలపడుతుందని నమ్ముతున్నాను.
ప్రధాని ప్రస్తావించిన ‘జీఎస్టీ పొదుపు పండుగ’ మరియు ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ ఆలోచన దేశీయ వ్యాపారాలకు కొత్త శక్తిని అందిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘గార్బేజ్ కేఫ్‌ల’ వంటి వినూత్న పథకాలను మనం కూడా మన నగరాల్లో ప్రోత్సహించాలని అన్నారు.
‘ఆపరేషన్ సింధూరం’ ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి మరియు అభివృద్ధి వాతావరణం నెలకొన్నదని ప్రధాని పేర్కొనడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ప్రధాని ప్రతి ‘మన్ కీ బాత్’ దేశ ప్రజల్లో జాతీయతా భావం, సేవా స్పూర్తి, పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తోంది. ఆయన ఆలోచనలు సమాజంలో సానుకూల మార్పుకు దారి చూపుతున్నాయి. ప్రజలు ఆయన చెప్పిన ‘స్వదేశీ’, ‘ఐక్యత’ మరియు ‘సేవ’ అనే మూడు సూత్రాలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి.



