Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాదిత కుటుంబానికి బియ్యం చేయూత

బాదిత కుటుంబానికి బియ్యం చేయూత

- Advertisement -

నవతెలంగాణ – అలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన కట్కూరి అంజయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు గంగాధరి సుధీర్ కుమార్ ఆదివారం కట్కూరి అంజయ్య కుటుంబాన్ని పరామర్శించరు. కుటుంబ సభ్యులను ఓదార్చి,మనోధైర్యం కల్పించిన అనంతరం బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టసమయంలో కుల సమాజం పరస్పర సహకారం ఎంతో అవసరమని, కుమ్మరి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరి పరమేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి జివిలికపల్లి సత్యనారాయణ, కొరుటూరి బాల్‌రాజు, కట్కూరి సిద్ధులు, గంగాధరి మహేందర్, శరాజీపేట గ్రామ అధ్యక్షుడు శనిగరం రవీందర్,కొల్లూరు గ్రామ అధ్యక్షుడు కట్కూరి రవి,గొలనుకొండ గ్రామ అధ్యక్షుడు కట్కూరి బాలస్వామి, కట్కూరి కృష్ణమూర్తి, కట్కూరి గోపి, కట్కూరి కరుణాకర్, కట్కూరి అశోక్, కొల్లూరు గ్రామ పెద్దలు,కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -