అవస్థలు పడుతున్న ప్రజలు…
స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు నుండి భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు రహదారి ప్రమాదకరంగా మారింది. రైల్వే నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్న కారణంగా బి టి పి ఎస్ ప్రారంభం నుండి రోజుకు 18 వేల టన్నులకు పైగా బొగ్గును భారీ లారీల ద్వారా బి టి పి ఎస్ కు సరఫరా చేస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు 24 గంటలు ఇసుక లారీలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి దీని కారణంగా మణుగూరు సురక్ష బస్టాండ్ నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు నేషనల్ హైవే తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షం వస్తే తీవ్రమైన బురద పేరుకుపోతుంది. ఎండ కొడితే విపరీతమైన బొగ్గుచూర దుమ్ము ఏగ చిమ్ముతున్నది దీని కారణంగా భారీ వాహనాలు రాకపోకలకునరకపాయంగా మారినాయి.
ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర వాహనాలు ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని నడపాల్సిందే. అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కొందరు విగత జీవులుగా మంచానికే పరిమితమయ్యారు అనేక మూగజీవాలు మృత్యువాత గురయ్యాయి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మే నెల నుండి భారీ వర్షాలు అక్టోబర్ వరకు నిరంతరాయంగా నమోదు కావడంతో ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారింది ఇటీవల కాలంలో మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు మరియు బిఆర్ఎస్ నాయకులు డిజిటల్ ప్రచారం నిర్వహించారు.
సింగరేణి, బి టి పి ఎస్ అధికారులు తమ పరిధిలో లేదని దాటవేశారు ఆర్ అండ్ బి అధికారుల ఉనికే ప్రశ్నార్థకమైంది స్పందించని అధికారులు లేకపోవడం విచారకరం. పివి కాలనీ క్రాస్ రోడ్ నుండి సురక్ష బస్టాండ్ వరకు వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. అధిక జనసంచారం ఉండే ఈ ప్రాంతాలలో గుంతల కారణంగా ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందని ద్విచక్ర వాహనాల దారులు, పాదాచారులు ఇతర వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు మండలంలో భారీ వర్షాలు,వరదల కారణంగా మణుగూరు మున్సిపాలిటీ మరియు 14 గ్రామపంచాయతీలలో అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా కూనవరం సమీపంలో కోడిపుంజుల వాగు ఉధృతికి సింగరేణి నిర్మించిన బ్రిడ్జి కోత గురై ప్రమాదకరంగా మారింది.
ఆవాస ప్రాంతాలు సైతం వాగు పై బ్రిడ్జి కారణంగా వరద ఉధృతికి కోతకురైనాయి సమితి సింగారం పంచాయతీ పరిధిలో వెంకటపతి నగర వద్ద కోడిపుంజుల వాగు బ్రిడ్జి గురై సిసి రోడ్డు కూలడానికి సిద్ధంగా ఉన్నది. పగిడేరు పంచాయతీలో శాంతినగర్ ఊర చెరువు అలుగు కారణంగా సిసి రోడ్లు సైతం కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఊరు మధ్యలో అలుగుపై నిర్మించిన బ్రిడ్జి, సిసి రోడ్ ప్రమాదకరంగా కోతకు గురైనది దీని కారణంగా నివాస ప్రాంతాలు కూలే ప్రమాదం ఏర్పడుతుంది పగిడేరు (పాతూరు) గ్రామంలో పోచంపల్లి చెరువు అలుగు , వాగు ఉధృతి కారణంగా ప్రతి సంవత్సరం భారీ వరద ఊరిలో ప్రవహిస్తుంది. సిసి రోడ్డు సైతం కొట్టుకుపోయాయి అంతర్గత రహదారులపై రాళ్లు మొన తేలడంతో నడవడానికి ప్రజలు జనుకుతున్నారు సాంబాయిగూడెం ఇసుక ర్యాంపు దగ్గరలో ప్రధాన రహదారిపై బ్రిడ్జి కూలిపోయింది . ప్రమాదకర పరిస్థితిలో ఉన్నది.
ఇలాంటి పరిస్థితులు మణుగూరు మండలం, మున్సిపాలిటీలో కోకోలుగా ఉన్నాయి సిసి రోడ్లు దయనీయంగా మారినాయి. డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగనీరు ఆవాస ప్రాంతాలలోనే నిలిచిపోయింది. ప్రధానంగా సమితి సింగారం పంచాయతీ కార్యాలయం నుండి వివేకానంద కాలనీ వరకు పలు కాలనీలో మురుగునీరు పేరుకుపోయింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కార్మికులు విధులకు వెళ్లే రహదారులు కూడా గుంతల మయంగా మారినాయి. వెంటనే రహదారి నిర్మించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి బిటిపిఎస్ రహదారిని మెరుగుపరచాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అంతర్గత రహదారులను, డ్రైనేజీ వ్యవస్థ యుద్ధ ప్రాతిపదిక బాగు చేయాలని ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులు
- Advertisement -
- Advertisement -



