Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జోగులాంబ ఆలయ ఈవో ను సస్పెండ్ చేయాలి

జోగులాంబ ఆలయ ఈవో ను సస్పెండ్ చేయాలి

- Advertisement -

కెవిపిఎస్ నాయకుడు విజయ్ కుమార్
నవతెలంగాణ – రాజలి

జోగులాంబ ఆలయ ఈవో దీప్తిరెడ్డిని సస్పెండ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జోగులాంబ ఆలయానికి కూరగాయలు సరఫరా చేసే టెండర్ దక్కించుకున్న శ్రీలత అన్ని మతస్తురాలు అనే పేరుతో టెండర్ అప్రూవల్ లెటర్ ఇవ్వకుండా సతాయిస్తున్న ఈవోను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జోగులాంబ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉందని హిందూ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకున్న ట్రస్టు కాదని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా టెండర్ వేయవచ్చని అన్నారు. ఆలయానికి సరఫరా చేసే కూరగాయలు శుభ్రంగా ఉండాలని కోరాలి తప్ప కూరగాయల సరఫరాకు మతంతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

ఆలయంతో ఎలాంటి సంబంధం లేని విష్ణువర్ధన్ రెడ్డి ఆలయంలో పితానం చేస్తూ అగ్రకుల ఆధిపత్యాన్ని చూయిస్తున్నాడని అన్నారు. ఆలయంలో అన్ని విషయాలలో జోక్యం చేసుకుంటున్నా ఈవో దీప్తి రెడ్డి తమ్ముడు అయినా విష్ణువర్ధన్ రెడ్డిని ఆలయానికి సంబంధం లేకుండా చూడాలని అన్నారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మతవైషమ్మేలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గత 50 రోజులుగా జోగులాంబ ఆలయంలో వివాదం జరుగుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. తక్షణమే టెండర్ దక్కించుకున్న శ్రీలతకు అప్రూవల్ లెటర్ ఇవ్వాలని, జోగులాంబ ఆలయం ఈవో దీప్తి రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు అయినా ఇప్పటివరకు విచారణ చేసి అరెస్టు చేయలేదని ఎస్సీ ఎస్టీ కేసులో ఈవోకు స్టేషన్ బెల్ ఇవ్వకుండా ఉండాలని కోరారు. జోగులాంబ ఆలయం ఈవో పై జిల్లా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -