తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్
నవతెలంగాణ – ఆర్మూర్
తడిసిన వడ్లను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. మండలంలోని చేపూరు గ్రామం బైపాస్ రోడ్డు వద్ద పోసిన వరికుప్పలను తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కేంద్రానికి తెచ్చినప్పటికిని ప్రభుత్వ అలసత్వం వల్ల నేచర్ వచ్చినప్పటికీని వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల అనుకోకుండా వచ్చిన వర్షానికి మొత్తం వడ్లన్నీ తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ఉంది అని అన్నారు. ఒకవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచుతున్నామని చెప్పి ఇప్పటికే కోత కోసి రోడ్డుమీద కుప్పలుగా పోసి గత వారం పది రోజులు అవుతున్నప్పటికీ కాటా ప్రారంభించకపోవడం శోచనీయమని అన్నారు.
వర్షం పడటం వల్ల ఈరోజు ఐకెపి వాళ్లు ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులు తక్కువ ధర కైనా దళారులకు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు వారి నుండే తప్పుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులు బాధపడుతున్నారని అన్నారు అలాంటి పరిస్థితి లేకుండా రైతుల కోత కోసి వడ్లను తెచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచి రైస్ మిల్కీ తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని పరువు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సన్న వడ్లకు బోనస్ కూడా అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకి వడ్ల కుప్పలకి తాడిపత్రిలు కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వ నేరుగా కొనుగోలు చేసి చేసే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అన్నారు.
మక్కలు రైతులు రోడ్లమీద ఆరబోసిన తర్వాత వర్షానికి నల్లబడే దళారులకి తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేనియెడల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి భూమన్న,ఆర్మూర్ మండల నాయకులు శేపూరు సాయన్న, రైతులు ఆర్ చిన్నారెడ్డి ఆర్ అఖిల్, డి సాయి కృష్ణ ,ప్రవీణ్, రఘుపతి, పెరికేటు సొసైటీ మాజీ చైర్మన్ డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



