నవతెలంగాణ-హైదరాబాద్ : మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్ తెలంగాణలో 204 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జహీరాబాద్ పరిధిలో ఉన్న మైనారిటీ గురుకులాల నుంచి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 16 మంది విద్యార్థులకు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,022 గురుకులాలను కేసీఆర్ ఏర్పాటు చేశారని, నేడు వాటి నుంచి ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లుగా తయారవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, కేవలం జహీరాబాద్ నుంచే 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. మైనార్టీ గురుకులాల్లో ఫలితాలు ఎంతో గొప్పగా ఉన్నాయనడానికి ఈ 16 మంది విద్యార్థులే నిదర్శనమని కేటీఆర్ అన్నారు.
ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 16 మంది విద్యార్థులకు తెలంగాణ భవన్‌లో సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



