కక్షిదారులకు మెరుగైన సేవల
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న జిల్లా కోర్టును త్వరలో పాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవన సముదాయంలోకి మారుతుందని, దీని ద్వారా కక్షిదారులకు మెరుగైన సేవలు అందుతాయని జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఇప్పటివరకు జిల్లా కోర్టు ప్రైవేటు భవనంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో సేవలు అసౌకర్యంగా ఉండడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యాన్ని పాత పోలీస్ హెడ్ క్వార్టర్ భవన సముదాయంను కోర్టు నిర్వాహణ కోసం కేటాయించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు.
సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం స్పందించి కోర్టుకు కేటాయింపుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ ) అశోక్ కుమార్ నేతృత్వంలో పాత హెడ్ క్వార్టర్స్ భవనాలకు కిరాయి నిర్ధారణ చేసినట్లు వివరించారు. కోర్టు నిర్వహణ కోసం నెలకు రూ. 64 వేల అద్దె చెల్లించే విధంగా ఉత్తర్వులు బి/48/2025 తేదీ 10.10.2025 అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో కోర్టు భవనాన్ని ఒకే చోట అన్ని హంగులతో కక్షిదారులకు, ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలో కోర్టు భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ,ఫోర్త్ పోలియో న్యాయమూర్తులు ప్రారంభిస్తారని తెలిపారు.
పాత పోలీస్ హెడ్ క్వార్టర్లు కోర్టు భవనం ఏర్పాటుకు సహకరించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ,సింగరేణి సిఎండి బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, భూపాలపల్లి సింగరేణి ఏరియా జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ల తోపాటు సింగరేణి కార్మిక సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ సంగెం రవీందర్, సాంస్కృతిక కార్యదర్శి కుందారపుశివకుమార్, కోశాధికారి మంగళపల్లి రాజ్ కుమార్, ఈసీ మెంబర్ భూక్య రమేష్ నాయక్, సభ్యులు ఆరెల్లి వెంకటస్వామి,బార్ సోసియేషన్ సభ్యులు ఎస్కే మోహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మారనున్న జిల్లా కోర్టు సముదాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



