Monday, October 27, 2025
E-PAPER
Homeకరీంనగర్మినీ స్టార్ట్ హబ్ కరపత్రం ఆవిష్కరణ

మినీ స్టార్ట్ హబ్ కరపత్రం ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణలోని మొట్టమొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ డిజిటల్ మార్కెటింగ్ మినీ స్టార్ట్ హబ్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు జగ్గాని మల్లేశం చేతులు మీదుగా  ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం టెక్నాలజీ పరంగా భవిష్యత్తుకు అనుగుణంగా ఎన్నో రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది అలాంటిది సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా  (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ సంస్థ డిజిటల్ మార్కెటింగ్ ప్రారంభించడం చాలా సంతోషకరమైనది. అలాగే సిరిసిల్ల ప్రాంత యువకులైనటువంటి తమకు తెలిసినటువంటి యువకులు ఆలోచనలను అనుగుణంగా ముందుకు సాగుతూ టెక్నాలజీ పరంగా కొత్త తరాన్ని పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ సంస్థ యువకులకు విజయవంతంగా ముందుకు సాగాలని ఇలాంటి భవిష్యత్తులో ఎన్నో విజయాలు తమ సొంతం చేసుకోవాలని తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో (ఎన్.ఫైవ్.టి.జి) టెక్నాలజీ సంస్థ వ్యవస్థ స్థాపకులు, సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -