Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏదుల మండలంలో రైతు ఆత్మహత్య కలకలం

ఏదుల మండలంలో రైతు ఆత్మహత్య కలకలం

- Advertisement -

పార్టీలు ప్రజాసంఘాల నాయకుల నిరసన
నవతెలంగాణ – వనపర్తి

తన భూమి విషయంలో సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులు వర్తిల్ల కారణంగానే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏదుల మండలంలో కలకలం రేపుతోంది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన రైతు సంఘటనను తెలుసుకున్న ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు ఆదివారం రైతు మృతదేహాన్ని సందర్శించి, ఆయన చావుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్ మాట్లాడుతూ ఏదుల మండల కేంద్రంలోని రిజర్వాయర్ సమీపంలో నివసించే రైతు గొల్ల ఆంజనేయులు భూమి కే ఎన్ ఆర్ కంపెనీ కార్యకలాపాల వల్ల కోల్పోయాడన్నారు. దీంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యారని, కంపెనీ సబ్‌ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయులను జైలుకు పంపిస్తామని బెదిరించడంతో ఆయన కుటుంబం భయాందోళనకు గురైందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఆంజనేయులు తన కూతురుకు సబ్ కాంట్రాక్టర్ బెదిరింపుల గురించి చెప్పి గడ్డి మందు తాగినట్లు తెలిపాడన్నారు. కాంట్రాక్టర్, కంపెనీ సిబ్బంది బెదిరింపులకు గురి చేయడంతో ఆవేదనతో ఆంజనేయులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. మందు తాగిన విషయాన్ని తమకు తెలియడంతో 24వ తేదీన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారన్నారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం పరిస్థితి విషమించి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆంజనేయులు మరణానికి కారణమైన కే ఎన్ ఆర్ కంపెనీ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టామని తెలిపారు. ఈ ఘటనపై గ్రామ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారని తెలిపారు. ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కూతుళ్లకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఈ నిరసనలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాచాల యుగంధర్ గౌడ్, డివైఎఫ్ఐ నాయకుడు మహేష్, రాజశేఖర్, బిజెపి నాయకులు లోకనాథ్ రెడ్డి, నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -