నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ : రక్తహీనత పై సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ మినీ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ అధ్యక్షతన జిల్లా ఆశ నోడల్ ఆఫీసర్ ఫెసిలిటేటర్స్ సమావేశము నిర్వహించారు. ఈ సమావేశం నందు భారతదేశంలో గల ఆరు నెలల నుండి 60 సంవత్సరముల వయసుగల స్ర్తి పురుషులలో ఏ ఒక్కరు కూడా రక్తహీనతతో అనారోగ్యమునకు గురికాకూడదని అన్నారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు, గర్భవతులు, రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని కోరారు. ప్రాథమిక ఉప కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందించు ఆరోగ్య సేవలు అన్నింటిని, హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టంలో డాటా ఎంట్రీ చేయాలని ప్రాథమిక స్థాయిలో గర్భవతులను గుర్తించి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి, వారు ప్రసూతి అయ్యేవరకు తగు ఆరోగ్య సేవలను అన్నియు అందించి, గర్భిణీ దాల్చిన ప్రతి స్త్రీ ప్రభుత్వ హాస్పిటల్ లోనే ప్రసవించేలా మోటివేషన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా సమయపాలన పాటించి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని అన్నారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ శిల్పిని మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జరుగు కార్యక్రమాలను సమీక్షి నిర్వహించారు. ఆశా కార్య కర్తలందరూ కూడా వర్షాలు ప్రబలి ఉన్నందున వచ్చు వ్యాధులపై ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలని వేసవి కాలంలో ఎండలు అధికంగా ఉన్నందున రైతు కూలీలకు ,పొలం పనులు చేసుకునే వారికి, కూలి పనులు చేసుకునే వారికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం వారికి ఓఆర్ఎస్ పాకెట్లను ప్రజలకు అందజేయాలని, జిల్లాలో 21వ తారీకు నుండి 28వ తారీకు వరకు ఇంటెన్సీ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమము నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వీణ, డాక్టర్ రామకృష్ణ, డెప్యూటీ డెమో వి అంజయ్య, జిల్లా ఆశ నోడల్ అధికారి దార సత్యవతి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని ఆశ నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
రక్తహీనతపై సమీక్ష సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES