Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

- Advertisement -

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – తుర్కపల్లి  

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు .నాణ్యమైన వడ్లను అమ్మి సరసమైన ధరను పొందాలని అన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా నిర్వాహకులు అధికారులు చూడాలని అన్నారు. ప్రభుత్వం రైతుల ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినాల చైతన్య మహేందర్రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షుడు వంగ నారాయణ రెడ్డి మాజీ సర్పంచ్ వంగ రాజిరెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొనికెన వెంకటేష్ , వంగ దయాకర్ రెడ్డి చాడ కరుణాకర్ రెడ్డి జల్తార్ లచ్చయ్య బోయినీ కొండల్ మాదాపురం శంకరయ్య కుమ్మరి బాలకృష్ణ రత్నాల శేఖర్ నాగపురి నాగరాజు ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్కే హుస్సేన్ పి ఎస్ సి ఎస్ సిబ్బంది మహిళలు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -