- Advertisement -
ఈనెల 28న ఎమ్మెల్సీ కవిత రాక
తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు ఎల్లయ్య యాదవ్
నవతెలంగాణ – మిడ్జిల్
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 28న జడ్చర్ల మండలంలోని కురువ గడ్డపల్లి గ్రామంలో ని నీలంబరం శివాలయంనికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వస్తున్నారని తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు ఎల్లయ్య యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలమూరు జిల్లాలోని ఉద్యమకారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
- Advertisement -



