నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం మండలంలోని చల్వాయి గోవిందరావుపేట పసర ముద్దుల గూడెం గాంధీ నగర్ లక్ష్మీపురం తదితర గ్రామాల్లో స్వల్పకాలిక రకాలైన వరి వంగడాలను కొద్దిగా గొప్ప వరి కోతలు కోసిన రైతులు తమ ధాన్యాన్ని ఉదయం పూట ఆరవస్తు సాయంత్రం పూట పోగుచేస్తూ అవస్థలు పడుతున్నారు. సాధారణంగా రైతులు ఒకసారి ధాన్యాన్ని ఆరబోస్తే పూర్తిగా ఆరినాక కుప్పగా చేసుకొని శుభ్రం చేసుకుంటారు. తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఆకాశంలో మబ్బులు వస్తుండడంతో ఎక్కడ ధాన్యం తడిసిపోతుందో వర్షపు వరదలకు కొట్టుకుపోతుందో అన్న భయం రైతులను వెంటాడుతోంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడం వర్షం పడితే కప్పడానికి టార్పాలిన్స్ లేకపోవడం లేక రైతులు అవస్థ పడుతున్నారు. చేతి కాడికి వచ్చిన పంట నోటి నోటి దాకా రాదేమోనన్న భయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందన్న వార్త కథనాలతో రైతులు హడలిపోతున్నారు. మరికొంత ఏరియాలో వరి కోతలు కోసేందుకు సిద్ధంగా ఉండడంతో తుఫాన్ అలెర్ట రైతులు కోతలను నిలిపివేశారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీదు చేసిన ధాన్యాన్ని కాంట వేయించి వెంటనే తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
తుఫాన్ మొంథా ఎఫెక్ట్ తో రైతులు విలవిల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



