Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ రిజర్వేషన్ల సాధనకై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి 

బీసీ రిజర్వేషన్ల సాధనకై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి 

- Advertisement -

అఖిల పక్షం పిలుపు
నవతెలంగాణ – జోగులంబ గద్వాల

బీసీ రిజర్వేషన్ల సాధనకై నవంబర్ 9 న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని టీజేఎస్ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశంలో నవంబర్ 9న జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హల్ లో జిల్లా సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ లను వెంటనే అమలు చేయాలని,రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని, బీసీలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య పూరిత విధానాలకు వ్యతిరేకంగ  నవంబర్ 9 న జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే బీసీల జిల్లాస్థాయి సదస్సును జయప్రదం చేయాలని కోరారు.దేశ వ్యాప్తంగా 56 శాతంగా ఉన్న బీసీలకు శాస్త్రీయ కోణంలో కుల ఘనణ నిర్వహించి, జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయించి వారిని అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందన్నారు.బీసీ రిజర్వేషన్ లపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపించినప్పటికీ,ఆమోదించకుండ అడ్డుకట్ట వేసిందని విమర్శించారు.బీజేపీ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సబ్బండ జాతులు ఏకం కావాలని కోరారు.

బీసీల వ్యతిరేక పార్టీ, బీసీల ద్రోహి బీజేపీ చేస్తున్న దొంగ నాటకాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.రిజర్వేషన్ లను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బీజేపీ మనువాద విధానాల అమలు లో భాగంగా, బీసీలను రిజర్వేషన్ లకు దూరం చేసే విధానాలను, చేస్తున్న మోసాలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.బీసీలకు రిజర్వేషన్ లు దూరం చేయడం లో మొదటి ద్రోహి బీజేపీయే అన్నారు. అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం ఆఘామేఘాల మీద చట్టాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం,బీసీ రిజర్వేషన్ లపై ఎందుకు మోసపురితంగా వ్యవహారిస్తున్నదని ప్రశించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అఖిల పక్ష పార్టీలను ఢిల్లీకి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు.అందులో భాగంగా నవంబర్ లో నిర్వహించే జిల్లా సదస్సు కు హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుబాబు,సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి,ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికూర్ రెహమాన్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రభాకర్,నాగన్న పౌర హక్కుల సంఘం సుభాన్ brsv జిల్లా కన్వీనర్ కుర్వ పల్లయ్య,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ,బహుజన రాజ్య సమితి వినోద్,తెలంగాణ రైతంగ సమితి గోపాల్ యాదవ్,BRSV చిన్న,యూనిస్ టవర్ మబ్బుల్,న్యాయవాది దామోదర్,సామజిక ఉద్యమకారులు,సాదుతుల్ల,కృష్ణ, రాకేష్,లివింగ్ స్టన్, సీపీఎం నాయకులు లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -