సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నదని,ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు పంటను స్వేచ్ఛగా అమ్ముకోవడానికి ప్రభుత్వం కండిషన్ లు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వాలు సమస్యను గ్రహించి వెంటనే కపాస్ కిసాన్ యాప్ రద్దు చేసి గతంలో మాదిరిగా రైతు ఎక్కడైన స్వేచ్ఛగా పత్తి పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని సరంపేట గ్రామంలోని హరి హర పత్తి కొనుగోలు కేంద్రం కూడ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



