నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి ఖోఖో శిక్షణ శిబిరాన్ని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం ప్రారంభించారు కల్వకుర్తి బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో పది రోజులపాటు జరిగే శిక్షణ శిబిరంలో సీనియర్ పురుషులు మహిళలు పాల్గొని నవంబర్ 7న పెద్ద పెల్లిలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలకు విద్యార్థులు తరలి వెళ్ళున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలనుంచి విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని, ఇంత మంచి కార్యక్రమం కల్వకుర్తి నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి క్రీడ కార్యక్రమాలు కల్వకుర్తిలో మరిన్ని నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్ రాజుని అభినందించారు. తెలంగాణ కోకో అసోసియేషన్ కోశాధికారి హలో ఆధ్వర్యంలో కల్వకుర్తిలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు వారి అండదనులతో నిర్వహిస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఎక్కడ లేని విధంగా ఖోఖో క్యాంపు, సెలక్షన్లు ఎక్కడ జరిగిన వారి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉంటాయని అలాంటి పెద్దాయన మాకు దగ్గర అవడం ఎంతో సంతోషమని కల్వకుర్తి ఆర్గనైజర్ రాజు అన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్ కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, కున స్కైలాబ్, కల్వకుర్తి పరిసర ప్రాంత పీడీలు పురన్ చంద్, ప్రకాష్, జగన్ పీఇటి లు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో ఖోఖో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



