Monday, October 27, 2025
E-PAPER
Homeసినిమాతొలి భారతీయ సూపర్‌ షీ సినిమా

తొలి భారతీయ సూపర్‌ షీ సినిమా

- Advertisement -

”శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్‌ పీస్‌’ వంటి డిఫరెంట్‌ సినిమాలతో మూవీ లవర్స్‌ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్‌ ‘కిల్లర్‌’ అనే సై-ఫై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్‌ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో విశాల్‌ రాజ్‌, దశరథ, చందూ, గౌతమ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో ఏయు అండ్‌ ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థతో కలిసి థింక్‌ సినిమా బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్‌ ప్రజయ్ కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి కొలాబ్రేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

ఆదివారం ఈ మూవీ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఇండియా ఫస్ట్‌ సూపర్‌ షీ మూవీగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌, సూపర్‌ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్‌ బొమ్మిశెట్టి, మ్యూజిక్‌ – ఆశీర్వాద్‌, సుమన్‌ జీవ, వీఎఫ్‌ఎక్స్‌, వర్చువల్‌ ప్రొడక్షన్‌ – మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ – దశరథ, సమర్పణ -ఉర్వీష్‌ పూర్వజ్‌, నిర్మాతలు – పూర్వాజ్‌, ప్రజయ్ కామత్‌, ఎ. పద్మనాభరెడ్డి, రచన దర్శకత్వం – పూర్వాజ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -