విష్ణు విశాల్ నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ ‘పరిచయమే..’ సాంగ్ రిలీజ్. జిబ్రాన్ ఈ సాంగ్‌ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సామ్రాట్ అందించిన లిరిక్స్ అందర్నీ అలరిస్తున్నాయి. జిబ్రాన్, అభివి, భత్త వోకల్స్ లవ్లీ ఫీల్‌ని యాడ్ చేశాయి. ఈ సాంగ్‌లో లీడ్ పెయిర్ జర్నీ హత్తుకునేలా ఉంది. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. ‘ఆర్యన్’ ఈనెల 31న విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్) గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణం – విష్ణు విశాల్ (విష్ణు విశాల్ స్టూడియోస్), దర్శకత్వం – ప్రవీణ్ కె, నిర్మాతలు – శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్, తెలుగు రిలీజ్: సుధాకర్ రెడ్డి (శ్రేష్ట్ మూవీస్), డీఓపీ- హరీష్ కన్నన్, సంగీతం – జిబ్రాన్, ఎడిటర్ – శాన్ లోకేష్, స్టంట్స్ – స్టంట్ సిల్వా, పిసి స్టంట్స్ ప్రభు, ప్రొడక్షన్ డిజైన్ – ఎస్.జయచంద్రన్.
పరిచయం నుంచి పరిణయం వరకు..
- Advertisement -
- Advertisement -



