పాలిసెట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ – సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తంగళ్ళపల్లి, గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టి.జి.పాలిసెట్ – 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల తరగతి గదులన్నింటిని తిరిగి పరీక్ష విధానాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన సీ.సీ.టి.వి. కెమెరాలు పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలీసెట్ ప్రవేశ పరీక్ష సజావుగా ప్రశాంతంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తంగళ్ళపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ శంకర్ నారాయణ ఆదేశించినారు. అదే విధంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన బోరునకు మోటర్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కోరగా పంచాయతీ సెక్రటరీకి ప్రతిపాదనలు సమర్పించవలసిందిగా ప్రిన్సిపల్ కు తెలిపారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట (ప్రిన్సిపాల్) చీఫ్ సూపర్డెంట్లు శంకర్ నారాయణ, శారద, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ప్రశాంతంగా టిజీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES