నవతెలంగాణ – భువనగిరి : 13 మార్చి 2025 మంగళవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సుందరయ్య భవనంలో ,ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని మండలాలకు చెందిన కరాటే మరియు కుంగ్ పూ,తైక్వాండో వివిధ అకాడమీలకు చెందిన మాస్టర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా బాలరాజు, అధ్యక్షులుగా అన్నపు వెంకట్, ప్రధాన కార్యదర్శిగా మామిడాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాచకొండ రాజు, భువనగిరి ముత్యాలు, ఎల్లంకి శంకర్, కోశాధికారిగా గంగాదేవి జంగయ్య, సహాయ కార్యదర్శిగా మారగాని సుదర్శన్,భోగా వెంకటేశు, క్రాంతి కుమార్, చెన్నకేశవ, కార్యవర్గ సభ్యులుగా ఎర్ర మహేష్, కస్తూరి రాములు,దొడ్డి శ్రీను, కనుక రాజు,ఎండి గౌసు, కరుణాకర్,వినోద్ కుమార్, నిఖిల్, శ్యామ్, ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES